తవ్వి వదిలేశారు | - | Sakshi
Sakshi News home page

తవ్వి వదిలేశారు

May 29 2026 2:37 AM | Updated on May 29 2026 2:37 AM

కొత్తచెరువు నుంచి వచ్చే వరదను తరలించేందుకు ఐదేళ్ల క్రితం శ్రీనగర్‌ ఏరియా నుంచి తాత్కాలికంగా కచ్చా నాలా తవ్వి వదిలేశారు. ఏటా వరదలు మా ప్రాంతాన్ని ముంచేస్తున్నాయి. శ్రీనగర్‌ వైపు వరదలు రాకుండా చంద్రంపేట ఎక్స్‌రోడ్‌ నుంచి మళ్లించాలి. కబ్జాకు గురైన కొత్తచెరువు మత్తడి కాల్వలను పునర్‌ నిర్మించాలి. – కందాల నవీన్‌కుమార్‌,

శ్రీనగర్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు

ప్రమాదాలు జరగకుండా చూడాలి

శ్రీనగర్‌ కచ్చా నాలా వద్ద ప్రమాదాలు జరగకుండా డ్రెయినేజీని నిర్మించాలి. కచ్చా కాల్వ తవ్వి వదిలేశారు. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు. గతంలో రూ.15 కోట్లు మంజూరైనా పనులు ఇంకా ప్రారంభం కాలేదు.

– అన్నారం శ్రీనివాస్‌, స్థానిక రైతు

కచ్చా నాలాను పొడగిస్తున్నాం

శ్రీనగర్‌ ప్రాంతంలోని కచ్చా నాలాను తుమ్మలకుంట వరకు పొడగిస్తాం. రానున్న వానాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. పక్కా డ్రెయినేజీకి సాంకేతిక అనుమతులు రాగానే పనులు మొదలుపెడతాం. కచ్చానాలాలో సిల్ట్‌, పిచ్చిమొక్కలు తొలగిస్తున్నాం.

– ఎంఏ ఖదీర్‌పాషా, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement