ధాన్యం వెంటనే తరలించాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం వెంటనే తరలించాలి

May 29 2026 2:37 AM | Updated on May 29 2026 2:37 AM

● అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌

● అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌

వేములవాడరూరల్‌/బోయినపల్లి: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులు, గోదాములకు తరలించాలని, సరిపడా వాహనాలు సమకూర్చాలని అడిషనల్‌ కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ సంబంధిత ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్లకు సూచించారు. వేములవాడ రూరల్‌ మండలం వట్టెంల, ఫాజుల్‌నగర్‌, శాత్రాజుపల్లి, బోయినపల్లిలోని మార్కెట్‌యార్డుతోపాటు కోరెం, బూర్గుపల్లి కొనుగోలు కేంద్రాలను గురువారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని త్వరగా తూకం వేసి తరలించాలని నిర్వాహకులకు సూచించారు. హమాలీల సంఖ్య పెంచుకుని కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement