వడ్లు జోకుడు గింత ఆలస్యం ఎన్నడూ కాలేదు. పొలం కోసి గిన్ని రోజులైంది. లారీలు లేవని, జోరసంచులు లేవని, హమాలీ కూలీలు లేరని చెబుతూ ఆలస్యం చేసిండ్రు. ఇప్పుడు వానాకాలం వచ్చే. నారు పోసేటోళ్లు పొలం సాగి తుకాలు పోస్తుండ్రు. వడ్లు మాత్రం పోకపాయే. గింత పాపం ఎన్నడూ కాలేదు.
– పంగ మల్లయ్య, పెద్దబోనాల
కొనుగోళ్లకు నష్టం లేదు
జిల్లాలో కురిసిన వర్షాలతో ధాన్యం కొనుగోళ్లకు నష్టం లేదు. లోతట్టు ప్రాంతాల్లో వడ్ల రాశులు పోసిన చోట కొద్దిగా నీరు చేరింది. పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నాం. అధికారులు క్షేత్రస్థాయిలో కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారు. రైతులు ఆందోళన చెందవద్దు.
– గడ్డం నగేశ్, అదనపు కలెక్టర్


