లింగనిర్ధారణ నేరం | - | Sakshi
Sakshi News home page

లింగనిర్ధారణ నేరం

May 28 2026 2:10 AM | Updated on May 28 2026 2:10 AM

సిరిసిల్ల: లింగ నిర్ధారణ తీవ్ర నేరమని, స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్‌.రజిత హెచ్చరించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో జిల్లా స్థాయి పీసీపీఎన్‌డీటీ సలహా సంఘం సమావేశం బుధవారం జరిగింది. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రతీ మూడు నెలలకోసారి చేస్తున్న తనిఖీల్లో స్కానింగ్‌ సెంటర్ల రికార్డులను పరిశీలిస్తున్నామన్నారు. లింగ నిర్ధారణ చేసినట్లు మా దృష్టికి వస్తే స్కానింగ్‌ సెంటర్లను సీజ్‌ చేసి, క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. జిల్లా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రజనీకాంత్‌, పెంట శ్రీనివాస్‌, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి గైనకాలజిస్ట్‌ సుచేతన లక్ష్మి, పీడియాట్రిషియన్‌ పరమేశ్‌, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement