● రాష్ట్ర పరిశీలకుడు పీటర్
ఎల్లారెడ్డిపేట/తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లాలో 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలకు క్యాన్సర్ నిరోధక టీకాల పంపిణీలో రాష్ట్రస్థాయిలోనే మొదటి స్థానంలో ఉందని, వైద్యసిబ్బందిని రాష్ట్ర పరిశీలకులు, జా యింట్ డైరెక్టర్, వ్యాధి నిరోధక టీకాల అధికారులు ఫీటర్, డేవిడ్ అభినందించారు. ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లిల్లోని పీహెచ్‌సీలను బుధవారం పరిశీలించా రు. గ్రామీణ ప్రాంతాల్లో టీకాలపై అవగాహన కల్పించి, ముందంజలో ఉండడంపై అభినందించారు. టీకాల నిల్వలు, ముందస్తు ప్రణాళికలను పరిశీలించిన అధికారులు సిబ్బంది పనితీరును కొనియాడారు. జిల్లా వైద్యాధికారి రజిత, మండల వైద్యాధికారి సరియా అంజుమ్ పాల్గొన్నారు.


