డేంజర్‌ హోర్డింగ్స్‌ | - | Sakshi
Sakshi News home page

డేంజర్‌ హోర్డింగ్స్‌

May 28 2026 2:10 AM | Updated on May 28 2026 2:10 AM

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026

జిల్లా కేంద్రంలో ప్రకటనల హోర్డింగ్స్‌ ప్రమాదకరంగా ఉన్నాయి. పాతబస్టాండ్‌, అంబేడ్కర్‌ చౌరస్తా, గాంధీసర్కిల్‌ వద్ద ఈ హోర్డింగ్స్‌ డేంజర్‌గా మారాయి. జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో పలు షాపింగ్‌మాల్స్‌, విద్యాసంస్థలు తమ బ్రాండ్‌ను మార్కెటింగ్‌ చేసుకునేందుకు భారీ హోర్డింగ్స్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఈదురుగాలులకు హోర్డింగ్స్‌ ఊగుతున్నాయి. ఫ్లెక్సీలు గాలికి చినిగి వేలాడుతున్నాయి. వాహనాలపై వెళ్లే వారిపై పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మున్సిపల్‌ అధికారులు పట్టించుకొని క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్‌, ఫ్లెక్సీలను తొలగించాల్సిన అవసరం ఉంది.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, రాజన్నసిరిసిల్ల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement