అకాల వర్షం.. రైతులు ఆగమాగం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. రైతులు ఆగమాగం

May 28 2026 2:10 AM | Updated on May 28 2026 2:10 AM

సిరిసిల్లటౌన్‌/సిరిసిల్లఅర్బన్‌/తంగళ్లపల్లి/ఇల్లంతకుంట/ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్‌/బోయినపల్లి: జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కురిసిన ఈదురుగాలులు.. వర్షానికి కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఈదురుగాలులకు ఇంటి పైకుప్పులు లేచిపోగా, విద్యుత్‌స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలోని హైస్కూల్‌ ఆవరణలో ఉన్న కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది. తంగళ్లపల్లి మండలంలో తూకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. బోయినపల్లి మండలం దుండ్రపల్లి ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. మూడు విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌, ముస్తాబాద్‌, నామాపూర్‌, ఆవునూర్‌, తెర్లుమద్ది గ్రామాల్లోని కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఎల్లారెడ్డిపేట మండలంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని సింగిల్‌విండో చైర్మన్‌ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కృష్ణహరి పరిశీలించారు.

బోయినపల్లి: దుండ్రపల్లిలో లేచిపోయిన పై కప్పు

ఎల్లారెడ్డిపేటలో తడిసిన ధాన్యం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement