కాసులిస్తేనే కాంటా పెడుతున్నారు | - | Sakshi
Sakshi News home page

కాసులిస్తేనే కాంటా పెడుతున్నారు

May 28 2026 2:10 AM | Updated on May 28 2026 2:10 AM

మల్యాల, ముస్తాబాద్‌లో రోడ్డెక్కిన రైతులు

చందుర్తి/ముస్తాబాద్‌: కాసులిస్తేనే కాంటాలు పెడుతున్నారంటూ చందుర్తి మండలం మల్యాలలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ గ్రామంలోని లీడర్ల ధాన్యం కంటాలు వేస్తూ సామన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం తెచ్చి 70 రోజులు గడుస్తున్నా కాంటాలు పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై రమేశ్‌, ఐకేపీ ఏపీఎం కల్యాణి అక్కడికి చేరుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి, కొనుగోళ్లు వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. సర్పంచ్‌ మందాల శారదఅబ్రహం, రైతులు పాల్గొన్నారు.

పలుకుబడి ఉన్నోళ్లవే కొంటున్నరు

పలుకుబడి ఉన్నోళ్లవే కొంటున్నారంటూ ముస్తాబాద్‌లో రైతులు ఆగ్రహం ధర్నా చేశారు. ముస్తాబాద్‌, సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ముస్తాబాద్‌ ప్యాక్స్‌ కేంద్రంలో నెల రోజుల క్రితం తీసుకొచ్చిన ధాన్యాన్ని ఇప్పటి వరకు తూకం వేయలేదన్నారు. ఎస్సై గణేశ్‌ రైతులతో మాట్లాడి శాంతింపజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement