● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడరూరల్: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్‌నగర్‌లో నూతనంగా నిర్మించే పెద్దమ్మతల్లి ఆలయానికి బుధవారం భూమిపూజ చేశారు. విప్ మాట్లాడుతూ గ్రామ దేవతలను పూజించడం ద్వారా గ్రామాల్లో ప్రశాంతత నెలకొంటుందన్నారు. పెద్దమ్మ ఆలయానికి ప్రభుత్వం తరఫున రూ.46 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, సర్పంచులు గడ్డం లిఖిత, రంగు వెంకటేశ్‌గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సోయినేని కరుణాకర్, ఆత్మ కమిటీ సభ్యుడు బండ శ్రీనివాస్, కులపెద్దలు గండి స్వామి, పోగుల సత్తయ్య, ఉప్పరి పెద్దులు, గంగుల ప్రసాద్, సిలివేరి లచ్చయ్య, రేగుల శంకర్, పిట్టల లక్ష్మీనర్సు, ఉప్పరి అంజయ్య పాల్గొన్నారు.


