సోషల్‌ మీడియా వదంతులు నమ్మొద్దు | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా వదంతులు నమ్మొద్దు

May 28 2026 2:10 AM | Updated on May 28 2026 2:10 AM

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

వేములవాడ: సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని ఎస్పీ మహేశ్‌ బీ గీతే కోరారు. బక్రీద్‌ సందర్భంగా పట్టణంలోని బైపాస్‌రోడ్డులోని ఈద్గాను బుధవారం పరిశీలించి మాట్లాడారు. శాంతియుత వాతావరణంలో కలిసిమెలిసి పండుగలు నిర్వహించుకోవాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పశువుల అక్రమ రవాణా జరగకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలి

ప్రజలకు అందుబాటులో ఉండాలని పోలీస్‌ సిబ్బందికి ఎస్పీ సూచించారు. పట్టణ ఠాణాను పరిశీలించారు. కేసుల వివరాలు, పెండింగ్‌ కేసుల పురోగతి, స్టేషన్‌ రికార్డుల నిర్వహణ, రౌడీషీటర్లు, నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించారు. టౌన్‌ సీఐ వీరప్రసాద్‌, ఎస్సైలు ఎల్లాగౌడ్‌, శ్రీనివాస్‌, ప్రేమనందం తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement