బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత

May 27 2026 12:59 AM | Updated on May 27 2026 12:59 AM

గంభీరావుపేట(సిరిసిల్ల): బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం అన్నారు. మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మండలకేంద్రంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని, అలాంటివి జరిగినప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. బాల్య వివాహాలకు కారణాలు, అనర్థాల గురించి కిషోర బాలికలకు, మహిళలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీడీపీవో ఉమారాణి, జిల్లా సమాక్య అధ్యక్షురాలు భాగ్య, తహసీల్దార్‌ మారుతిరెడ్డి, ఎంపీడీవో రాజేందర్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ కొమిరిశెట్టి విజయలక్ష్మి, సర్పంచులు మల్లుగారి పద్మ, అర్చన, విజయలక్ష్మి, మహేశ్‌యాదవ్‌, రమేశ్‌, విమల, సుకన్య, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రేణుక, ఏపీఎం జయసుధ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement