రైతు విజ్ఞాన కేంద్రం ద్వారా అన్నదాతలకు మరిన్ని సేవలు అందనున్నాయి. మర్రిపల్లిలో నిర్మించే కేంద్రంలో పంటల నమూనా, సాగు పద్ధతులు, భూ పరీక్షలు, అన్ని రకాల విత్తనాలు అందుబాటులోకి వస్తాయి.
– డా.ఆర్.సాయికుమార్,
రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్
రైతులకు ఎంతో మేలు
మర్రిపల్లి గ్రామంలో రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటుతో జిల్లా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రైతును రాజు చేస్తానని చెప్పినట్లే ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పెద్ద మేలు చేశారు.
– బండ శ్రీనివాస్,
ఆత్మ కమిటీ సభ్యుడు, వెంకటాంపల్లి


