ఆర్థికాభివృద్ధిలో మహిళా సంఘాల ముందంజ | - | Sakshi
Sakshi News home page

ఆర్థికాభివృద్ధిలో మహిళా సంఘాల ముందంజ

May 27 2026 12:59 AM | Updated on May 27 2026 12:59 AM

సిరిసిల్లటౌన్‌: మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించడానికి సమాఖ్య సంఘాల పాత్ర ఎనలేనిదని సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ అన్నారు. మంగళవారం మూడో వార్డులో మహిళ సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. మహిళా సంఘాల సాధికారతకు పురపాలక సంఘం ద్వారా పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. ఇందిరమ్మ చీరలను ఈ రోజు నుంచి అన్ని వార్డుల్లో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆర్పీలు, మహిళా సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.

ఘనంగా 108 పైలెట్స్‌ డే

సిరిసిల్లటౌన్‌: జాతీయ 108 అంబులెన్స్‌ పైలెట్స్‌ డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా మేనేజర్‌ సావనపెల్లి అరుణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో 108 అంబులెన్స్‌ పైలెట్లు కేక్‌ కట్‌ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు 108 పైలెట్లు రాత్రింబవళ్లు అంకితభావంతో సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు సమయానికి వైద్య సేవలు అందించడంలో పైలెట్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. పెద్ది శ్రీనివాస్‌, బరిగె లక్ష్మణ్‌, మామిడాల ఆంజనేయులు, పోచంపల్లి పరశురాములు, వనపర్తి అనిల్‌, పంతగాని మహేశ్‌, మొగిలి సుధాకర్‌, బరిగెల మనోజ్‌, నలికె నవీన్‌, నాగసముద్రం రాజశేఖర్‌, బండారి ప్రణయ్‌, చల్ల మధుసూదన్‌, జలగం సత్యసాగర్‌, మంత్రి కిషోర్‌, వడ్నాల అనిల్‌, చల్ల సత్తయ్య, నునావత్‌ మధన్‌, పంతం సాయికృష్ణ, మినుప స్వామి పాల్గొన్నారు.

29న పాలిసెట్‌ ధ్రువపత్రాల పరిశీలన

వేములవాడఅర్బన్‌: ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు ఈనెల 29 నుంచి వేములవాడ మండలం అగ్రహారం శ్రీ రాజరాజేశ్వరస్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో టీజీ పాలిసెట్‌– 2026లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించనున్నట్లు ప్రిన్సిపాల్‌ ప్రభాకరచారి తెలిపారు. ఈ నెల 27 నుంచి 31 వరకు విద్యార్థులు https://tgpolycet. inc.in వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. 29 నుంచి జూన్‌ 3 వరకు ధ్రువపత్రాల పరిశీలన తర్వాత కళాశాలలు, కోర్సులు ఎంచుకోవడానికి ఆప్షన్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. జూన్‌ 3 నుంచి 6 వరకు ఆప్షన్‌ ఇచ్చుకున్న వారికి సీట్ల కేటాయింపు, 6 నుంచి 9 వరకు వెబ్‌సైట్‌ ద్వారా ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌, 8 నుంచి 9 వరకు సీటు కేటాయించిన కళాశాలలో రిపోర్టింగ్‌ చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలు పాలిసెట్‌ ర్యాంకు కార్డు, ఆధార్‌, పదో తరగతి మెమో, టీసీ, 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్‌, 2026–27 సంవత్సరం ఆదాయం ధ్రువీకరణపత్రం, కుల ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించారు.

నర్మాల ప్రాజెక్టుకు మరమ్మతు చేపట్టాలి

సిరిసిల్లఅర్బన్‌: గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టుకు సంబంధించి పలు మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏవో రాంరెడ్డికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ప్రాజెక్టు కింది భాగంలో ఉన్న ఆఫ్రాన్‌ పూర్తిగా కొట్టుకుపోయిందని, దీంతో ప్రాజెక్టు పునాదులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. అలాగే నీటి తొట్లు శాసీ్త్రయంగా నిర్మించి, తుప్పు పట్టిన షటర్లు, గొలుసుకట్టు కాలువల మరమ్మతు పనులకు నిధులు మంజూరు చేయాలన్నారు. 2.2 టీఎంసీల నీరు నిల్వ ఉండే ప్రాజెక్టు ప్రస్తుతం 1 టీఎంసీ మాత్రమే పరిమితమైందన్నారు. అధికారులు స్పందించి పూడిక తీత పనులు చేపట్టాలన్నారు. లేకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. నాయకులు నాగరాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement