పెట్రో ధరలతో సామాన్యుల బతుకు దుర్భరం | - | Sakshi
Sakshi News home page

పెట్రో ధరలతో సామాన్యుల బతుకు దుర్భరం

May 27 2026 12:59 AM | Updated on May 27 2026 12:59 AM

ముస్తాబాద్‌(సిరిసిల్ల): సామాన్యుల బతుకులను దుర్భరం చేసేలా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతోందని కాంగ్రెస్‌ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ముస్తాబాద్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాజీవ్‌చౌక్‌ నుంచి తెలంగాణచౌక్‌ వరకు ఆటోను తాళ్లతో లాగి నిరసన తెలిపారు. ఈసందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, కేంద్రం పశ్చిమాసియాలో యుద్ధాన్ని సాకుగా చూపి, పొదుపు చేయాలంటూ ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిందన్నారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి ప్రజలు బతికే పరిస్థితి లేదన్నారు. ఎరువుల ధరలను పెంచి, నల్లచట్టాలను తీసుకువచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదన్నారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీకి రైతులు, ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయన్నారు. ఏఎంసీ చైర్‌పర్సన్‌ తలారి రాణి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు గజ్జెల రాజు, ఆత్మ కమిటీ నియోజకవర్గ చైర్మన్‌ కొండం రాజిరెడ్డి, డైరెక్టర్‌ కరెడ్ల కొండల్‌రెడ్డి, వెల్ముల రాంరెడ్డి, మిర్యాల్‌కార్‌ శ్రీను, గుండెల్లి శ్రీను, భాను, నరేశ్‌, రమణారెడ్డి, ప్రశాంత్‌, వుచ్చిడి బాల్‌రెడ్డి, కాంపెల్లి శ్రీను, దేవేందర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement