గాలివాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం

May 26 2026 12:05 AM | Updated on May 26 2026 12:05 AM

● రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన చెట్లు ● వంగిన విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ● కొట్టుకుపోయిన ఇంటి పైకప్పు రేకులు

ఇల్లంతకుంట/ఎల్లారెడ్డిపేట: జిల్లాలో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. రోడ్లపై చెట్లు విరిగిపడగా.. విద్యుత్‌స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు వంగిపోయాయి. ఇల్లంతకుంట మండల వ్యాప్తంగా 45 విద్యుత్తు స్తంభాలు నేలకొ రిగాయి. ఐదు డీటీఆర్‌ 25 కేటీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫా ర్మర్లు విరిగిపోయాయి. పత్తికుంటపల్లెలో మూడు ఇళ్లపైన రేకులు లేచిపోయాయి. అదే గ్రామానికి చెందిన చింతలపల్లి సత్యారెడ్డి ట్రాక్టర్‌పై వస్తుండగా చెట్టు విరిగి తలపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్లపై పడిన చెట్లను ఆయా గ్రామాల స ర్పంచులు జుట్టు శేఖర్‌, బద్దం శేఖర్‌రెడ్డి, నాగరాజు జేసీబీలతో తొలగింపజేశారు. పత్తికుంటపల్లెలో పొద్దుతిరుగుడు, వడ్ల కుప్పలు తడిసిపోయాయి.

పిడుగుపాటుతో ఎద్దు మృతి

ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లో కారుపై చెట్టు విరిగిపడడంతో ధ్వంసమైంది. గుంటపల్లి చెరువుతండాలో కిషన్‌నాయక్‌ చెందిన ఎద్దు పిడుగుపాటుతో చనిపోయింది. రాజన్నపేటలోని శ్మశానవాటికలో రేకులషెడ్డు లేచిపోయింది. ఈదురుగాలులతో రైతులకు అపారనష్టం వాటిల్లింది.

ఎన్పీడీసీఎల్‌ అధికారుల పరిశీలన

ఇల్లంతకుంట మండలంలో ఈదురుగాలుల బీభత్సానికి స్తంభాలు విరిగి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో త్వరగా పునరుద్ధరిస్తామని ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ వేణమాధవ్‌ పేర్కొన్నా రు. కేసన్నపల్లిలో విరిగిన స్తంభాలను డీఈ అంజయ్య, ఏడీ గోపీనాథ్‌లతో కలిసి పరిశీలించారు. ఏఈ నగేశ్‌కుమార్‌, సర్పంచ్‌ పోతరాజు చంటి, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ తిరుపతి ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement