సిరిసిల్లటౌన్: కడుపునొప్పి..గుండెనొప్పి..యాక్సిడెంట్.. డెలివరీ.. సమస్య ఏదైనా మొదట గుర్తొచ్చేది 108. ఒక్క ఫోన్‌కాల్‌తో మన వద్దకు వచ్చి ఆస్పత్రిలో చేర్పిస్తుంటారు. రాత్రి, పగలు తేడా లేకుండా నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకుంటున్న వీరి సేవలకు సలామ్ కొట్టాల్సిందే. నేడు 108 అంబులెన్స్ పైలెట్ల దినోత్సవం సందర్భంగా వారి నిస్వార్థ సేవలపై ప్రత్యేక కథనం.
ఈ చిత్రం తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్. ఈ గ్రామంలోని వృద్ధాశ్రమంలో ఉంటున్న ఓ అవ్వ జనవరి 10న అస్వస్థతకు గురైంది. ఫోన్‌కాల్ రావడంతో 108 సిబ్బంది అక్కడికి వెళ్లారు. ఆశ్రమానికి వెళ్లే దారి బురదమయం కావడంతో పైలెట్లు అవ్వను ఇలా స్ట్రెచ్చర్‌పై మోసుకొచ్చి జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు.


