నాకు రెండెకరాల పావు భూమి ఉంది. వరి కోసి నెల రోజుల కిందటే ఐకేపీ సెంటర్‌లో వడ్లు పోసిన. సీరియల్ నంబరు 146 వచ్చింది. వడ్లలో తేమ శాతం ఎప్పుడో వచ్చింది. కానీ లారీలు రావడం లేదని తూకం వేయడం లేదు. గన్నీ సంచులు లేవని ఆపుతుండ్రు. – సారగొండ వెంకట్‌రెడ్డి, ఆవునూరు
జోకి ఐదు రోజులైంది
నేను నాలుగు ఎకరాల్లో వరి పంట వేసిన. 290 బస్తాల వడ్లు వస్తే ఐదు రోజుల కిందటే జోకిండ్రు. లారీలు రావడం లేదు. తూకం వేసి వడ్లను వెంటనే తరలించకుంటే.. తరుగు వస్తుందని ఐకేపీ నిర్వాహకులు చెబుతున్నారు. లారీలను సకాలంలో పంపించాలి.
– రావులపెల్లి రాజిరెడ్డి, కనగర్తి


