జిల్లాలో ధాన్యం సేకరణలో వేగం పెంచాం. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. కలెక్టర్, అదనపు కలెక్టర్ నిత్యం ధాన్యం కొనుగోళ్లపై పర్యవేక్షిస్తున్నారు. లారీల కొరతను అధిగమించేందుకు స్థానికంగా ట్రాక్టర్లతోనూ రవాణాకు అవకాశం కల్పించాం. అన్ని మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. కొనుగోళ్లను స్ట్రీమ్‌లైన్ చేశాం. ఇప్పటికే 50 శాతానికి పైగా ధాన్యం సేకరణ పూర్తయింది. రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– ఎల్.బుచ్చిబాబు, జిల్లా పౌరసరఫరాల అధికారి


