‘కోడూరి’కి ఉత్తమ పురోహిత్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

‘కోడూరి’కి ఉత్తమ పురోహిత్‌ అవార్డు

May 25 2026 12:23 AM | Updated on May 25 2026 12:23 AM

సిరిసిల్లటౌన్‌: పట్టణానికి చెందిన కోడూరి రవీందర్‌శాసీ్త్రని ఉత్తమ పురోహితులు అవార్డు వరించింది. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో జీసీఎస్‌ వల్లూరి ఫౌండేషన్‌ అంతర్జాతీయ మాతృదినోత్సవం, గౌతమ బుద్ధ జయంతి ప్రత్యేక అవార్డు సెలబ్రేషన్స్‌ హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించారు. రవీందర్‌శాసీ్త్రకి ఫౌండేషన్‌ వ్యవస్థాపక చైర్మన్‌ వీఆర్‌.శ్రీనివాస్‌రాజ్‌ అవార్డు అందజేశారు.

విద్యుత్‌ తీగలు సరిచేయాలి

గంభీరావుపేట(సిరిసిల్ల): లూజ్‌ విద్యుత్‌ తీగలు సరిచేయాలని కోరుతూ మండలంలోని ముస్తఫానగర్‌లో రైతులు ఆదివారం ధర్నా చే శారు. వారు మాట్లాడుతూ ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడంతో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విద్యుత్‌ అధికారులు స్పందించి వదులుగా ఉన్న విద్యుత్‌ తీగల సరిచే యాలని కోరారు.

పోస్టర్‌ ఆవిష్కరణ

తంగళ్లపల్లి(సిరిసిల్ల): ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన ‘ముదిరాజ్‌ సింహావలోకనం’ మహాసభ వాల్‌ పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఈనెల 26న హైదరాబాద్‌, నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌ గ్రాండ్‌లాన్స్‌లో ముదిరాజ్‌ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘ముదిరాజ్‌ సింహావలోకనం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభకు తంగళ్లపల్లి మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల ముదిరాజ్‌ బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సంఘం గౌరవ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, అధ్యక్షుడు రంగు అంజయ్య, ప్రతినిధులు కొంగరి మల్లేశం, రంగు రాములు, కోడి వెంకటి, రంగు లక్ష్మీనర్సు, కోడి రాజలింగం, గడ్డమీద అంతయ్య, రంగు రాజు, మల్లేశం, నర్సయ్య, సంజీవ్‌, బుచ్చయ్య, దేవయ్య పాల్గొన్నారు.

‘సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా’

సిరిసిల్ల అర్బన్‌: జిల్లాలోని ఉపసర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్కిరెడ్డి కమలాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జిల్లాలోని ఉపసర్పంచుల సమావేశం నిర్వహించారు. అన్ని మండలాల ఉపసర్పంచులు కలిసి జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా లక్కిరెడ్డి కమలాకర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమలాకర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచులతో సమన్వయంగా ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement