లోడింగ్‌, అన్‌లోడింగ్‌లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

లోడింగ్‌, అన్‌లోడింగ్‌లో వేగం పెంచాలి

May 25 2026 12:23 AM | Updated on May 25 2026 12:23 AM

● జనగణన పకడ్బందీగా నిర్వహించాలి ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● జనగణన పకడ్బందీగా నిర్వహించాలి ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, వాహనాల్లో లోడింగ్‌, రైస్‌మిల్లులు, గోదాముల్లో అన్‌లోడింగ్‌లో వేగం పెంచాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి ఆదివారం అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌తో కలిసి టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తహసీల్దార్లు అందుబాటులో ఉండి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువలు తనిఖీ చేయాలని సూచించారు. కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల్లోని వాహనాలు, హమాలీలను మరో కేంద్రానికి తరలించాలని సూచించారు. రైస్‌మిల్లుల్లో అన్‌లోడింగ్‌ను పరిశీలిస్తూ పూర్తయిన వాహనాలను కొనుగోలు కేంద్రాలకు పంపించాలని అధికారులకు సూచించారు.

జనగణన పకడ్బందీగా చేపట్టాలి

జనగణన పకడ్బందీగా చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. జనగణనపై మండలాల వారీగా పురోగతిపై కలెక్టర్‌ ఆరా తీశారు. ఛార్జ్‌ అధికారులు తమ పరిధిలోని సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లతో సమావేశం నిర్వహించాలని సూచించారు.

మహిళా వారోత్సవాలు

ఘనంగా నిర్వహించాలి

‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 25 నుంచి 30 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, మెప్మా శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అంతకుముందు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ఎస్పీ మహేశ్‌ బీ గీతే, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, సిరిసిల్ల ఆర్డీవో రాజేందర్‌రెడ్డి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీనివాసాచారి, డీటీవో లక్ష్మణ్‌కుమార్‌, డీసీఎస్‌వో బుచ్చిబాబు, మేనేజర్‌ నరసింహ, డీఏవో అఫ్జల్‌బేగం, డీసీవో రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీబేగ్‌, కార్మిక శాఖ అధికారి నజీర్‌ అహ్మద్‌, మార్కెటింగ్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement