రాత్రిపూట పొలానికి నీరు పెట్టి ఇంటికి వచ్చాను. పొ ద్దున పొలం కాడికి పోయేసరికి సర్వీస్ వైరు కనిపించలేదు. సమీప పొలాల వద్ద సర్వీస్ వైర్లు, మోటార్లను రాత్రికి రాత్రే ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేశాం.
– కోల సాయికృష్ణారెడ్డి, నారాయణపూర్
మోటార్లకు రక్షణ కల్పించాలి
పొలాల వద్ద విద్యుత్ మోటార్లకు రక్షణ కల్పించాలి. అనుమానిత ప్రాంతాలలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తే దొంగతనాలు తగ్గుతాయి. విద్యుత్ మోటార్లు, వైర్లు ఎత్తుకెళ్తే నష్టపోతున్నాం.
– మోస్కంటి సుభాష్, నారాయణపూర్
నిఘా పెట్టాం
కొంతకాలంగా పొలాల వద్ద ఉన్న మోటార్లను ఎత్తుకెళ్తున్నారు. పాత నేరస్తులను విచారిస్తున్నాం. పొలాల వద్ద రైతులు బృందాలుగా కాపలా కాయాలి. అనుమానితులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలి. – రాహుల్‌రెడ్డి, ఎస్సై


