మరో నాలుగు రోజులు వడగాలులే | - | Sakshi
Sakshi News home page

మరో నాలుగు రోజులు వడగాలులే

May 24 2026 1:15 AM | Updated on May 24 2026 1:15 AM

● ఉమ్మడి జిల్లాలో రెడ్‌ అలర్ట్‌ ● జాగ్రత్తలు తప్పనిసరంటున్న వైద్యులు

జిల్లాల వారీగా నమోదైన ఉష్ణోగ్రతలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా రెడ్‌ జోన్‌లోకి చేరగా శనివారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్నడూ లేని విధంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్‌ జిల్లాలో రెండు మండలాలు, పెద్దపల్లి జిల్లాలో ఏడు మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవగా వడగాలుల ప్రభావం అధికంగా ఉందని ప్రణాళిక విభాగం అధికారులు ప్రకటించారు. కాగా ఉదయం 8 గంటలకే వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేయగా సాయంత్రం 6దాటినా దారులపై వడగా లులే. మరో నాలుగు రోజులపాటు వడగాలులుంటాయని వాతావరణ శాఖ ప్రకటించగా ప్రజలు జాగ్రత్త ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఆందోళనకరస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

కరీంనగర్‌(గంగాధర) 46.4

పెద్దపల్లి (ఎలిగేడు) 46.4

జగిత్యాల (కోరుట్ల, అయిలాపూర్‌) 46.4

రాజన్న సిరిసిల్ల (పెద్దూరు) 46.4

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement