
60 ఏండ్ల కల సాకారం
అరవై ఏండ్ల కల సాకారమైంది. వేములవాడకు మూడు బస్టాండులు ఉన్నాయి. ఆటోలు తిరుగుతాయి కాబట్టి రోడ్ల వెడల్పు అనివార్యం. రాజన్న గుడి నుంచి పోలీస్‌స్టేషన్ వరకూ రోడ్ల వెడల్పు పనులు చేపట్టాలి. అభివృద్ధి పనులతోనే పట్టణ రూపురేఖలు మారుతాయి.
– ఎండీ ఖాజాపాషా, రిటైర్డ్ కండక్టర్,
వేములవాడ
సరైన పరిహారం ఇవ్వాలి
40 ఏండ్లుగా నాకు మెయిన్‌రోడ్డులో చెప్పుల దుకాణం ఉంది. రోడ్డు వెడల్పుతో నా దుకాణం పోయింది. నాకున్న 18 గజాల స్థలానికి అమ్ముకుంటే రూ.50 లక్షలు వచ్చేవి. ప్రభుత్వం రూ.3.30లక్షలు ఇచ్చింది. పరిహారం న్యాయపరంగా ఉండాలి. ఇటీవల ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాను. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
– దోర బాలయ్య, ఫుట్‌వేర్, వేములవాడ

60 ఏండ్ల కల సాకారం