‘బీజేపీ అంటే సీఎం రేవంత్‌ భయపడుతున్నారు’ | BJP Leader Ramchander Rao Slams CM Revanth | Sakshi
Sakshi News home page

‘బీజేపీ అంటే సీఎం రేవంత్‌ భయపడుతున్నారు’

Jun 15 2026 7:11 PM | Updated on Jun 15 2026 8:01 PM

BJP Leader  Ramchander Rao Slams CM Revanth

హైదరాబాద్‌:  తమ పార్టీ అంటే సీఎం రేవంత్‌రెడ్డి  భయపడిపోతున్నారన్నారని  తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు. అందుకే కిషన్‌రెడ్డిని, బీజేపీని టార్గెట్‌ చేస్తున్నారన్నారు.  రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. సాక్షి టీవీతో మాట్లాడిన రాంచందర్‌రావు.. హైదరాబాద్‌ వ్యక్తిగా కిషన్‌రెడ్డితో పాటు తాసు కూడా ఇక్కడ అభివృద్ధి కోరుకుంటామని, రేవంత్‌కు హైదరాబాద్‌ అభివృద్ధి జరగాలని లేదని విమర్శించారు. 

బీజేపీ బలం పుంజుకుంటోందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారు.  కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వదు. మీరు టెక్నికల్ గా తప్పులు ఇస్తే తప్ప. మీ చేతగాని తనాన్ని మా మీద తోయాలని చూస్తున్నావు. మోదీ గురించి మాట్లాడే స్థాయి రేవంత్‌ది కాదు. మోదీ ముందు రేవంత్‌ చిన్నపిల్లాడు. రాష్ట్రంలో అసలు పాలన ఎక్కడుంది. సీఎం మాట ఎవరు వినట్లేదు’ అని ఆరోపించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement