దళిత మహిళపై టీడీపీ నేతల అసభ్య పదజాలం | Anantapuram TDP Leaders Scold Dalit Woman At Ambedkar Jayanti | Sakshi
Sakshi News home page

దళిత మహిళపై టీడీపీ నేతల అసభ్య పదజాలం

Apr 14 2026 11:23 AM | Updated on Apr 14 2026 2:55 PM

Anantapuram TDP Leaders Scold Dalit Woman At Ambedkar Jayanti

సాక్షి, అనంతపురం: అంబేద్కర్‌ జయంతి సందర్భంగా నగరంలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ దళిత నేతను టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుని అసభ్యపదజాలంతో దూషించారు. దీంతో ఆమె కంటతడి పెడుతూ నిరసనకు దిగారు. 

అనంతపురం సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద మంగళవారం జయంతి వేడుకలు జరిగాయి. ఆ సమయంలో.. వైఎస్సార్సీపీ నేత, ఏపీఎస్ఆర్టీసీ రీజినల్‌ మాజీ ఛైర్మన్‌ మంజుల అక్కడికి వచ్చారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ఆమె ప్రయత్నించగా.. టీడీపీ నేతలు అడ్డుపడుతూ తీవ్రంగా దూషించారు. 

టీడీపీ నేతల దౌర్జన్యంతో మంజుల కంటతడి పెట్టి అక్కడే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితుల గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాలను తాము సహించబోమని నినాదాలు చేశారు.

ప్రత్యక్ష్య సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా ఆమెను అవమానించారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఇలా దళిత నేతను అవమానించడం బాధాకరమని పేర్కొన్నారు.

దళిత మహిళపై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement