క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా ఎదగాలి

Jun 15 2026 1:53 AM | Updated on Jun 15 2026 1:53 AM

గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్‌

ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు

తెనాలి: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం, ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సూచించారు. పట్టణానికి చెందిన రజక వలంటరీ సర్వీస్‌ సొసైటీ ఆధ్వర్యంలో తొమ్మిదో వార్షికోత్సవాన్ని ఆదివారం స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు పోతార్లంక ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సభలో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు చెందిన సంఘీయులైన వందమంది విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్రొఫెసర్‌ నిరంజన్‌, పులిగడ్డ నారాయణరావు, కొండేటి సురేష్‌, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, విశ్రాంత మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరు మహాలక్ష్మీపతి, ఏపీ ట్రాన్స్‌కో డీఈఈ పాగోలు భవాని తదితరులు మా ట్లాడారు. విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.2 వేల ఉపకార వేతనం, నోట్‌ పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్‌ మెటీరియల్‌, ఎగ్జిక్యూటివ్‌ ఫైల్‌, వాటర్‌ బాటిల్‌, రీడింగ్‌ చైర్‌, ఫ్లాంక్స్‌ పంపిణీ చేశారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి పేటేటి శ్రీనివాస్‌, శివనాగేశ్వరరావు, పెదలంక వెంకటేశ్వరరావు, మోపిదేవి శ్రీనివాస్‌, నాంచారయ్య, పెసర్లంక రమణ తదితరులు పాల్గొన్నారు.

పట్నంబజారు: లిక్విడ్‌ గంజాయిని తరలిస్తూ.. బీటెక్‌ విద్యార్థితో పాటు ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేసి పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. లాలాపేట పోలీసు స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ ఇన్‌చార్జి, మహిళా పోలీసుస్టేషన్‌ డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, లాలాపేట పోలీసు స్టేషన్‌ సీఐ ఏవీ శివప్రసాద్‌ వివరాలను మీడియాకు వెల్లడించారు. గుంటూరు నగరంలోని పాతగుంటూరు, సంగడిగుంట ప్రాంతాలకు చెందిన రామిశెట్టి మహవీర్‌, అబ్బు సాయిమణికంఠతేజ, షేక్‌ రెహ్మాతుల్లాలు స్నేహితులు. వీరిలో ప్రధాన నిందితుడైన రామిశెట్టి మహావీర్‌ గంజాయికి అలవాటుపడి, డబ్బులు కోసం ఒడిశా ప్రాంతం నుంచి లిక్విడ్‌ గంజాయిని తీసుకుని వచ్చి గుంటూరులో విక్రయిస్తున్నాడు. శనివారం ఐపీడీ కాలనీలో సమీపంలోని సత్యసాయి బాబా ట్రస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ ఎస్‌యూవీ కారులో ముగ్గురు అనుమానాస్పదంగా ఉండటాన్ని గమనించారు. అదుపులోకి తీసుకుని విచారించటంతో పాటు వాహనాన్ని తనిఖీ చేయగా లిక్విడ్‌ గంజాయి దొరికింది. వీరిలో ప్రధాన నిందితుడిగా ఉన్న రామిశెట్టి మహావీర్‌ ఒక కళాశాలలో బీటెక్‌ అభ్యసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. వీరికి సహకరిస్తున్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 2కిలోల 110 గ్రాముల గంజాయి లిక్విడ్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్‌ చేసి, నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.

‘పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌’ అసోసియేషన్‌ సమావేశం

గుంటూరు రూరల్‌: నగరంలోని మండల పరిషత్‌ కార్యాలయం సమావేశ మందిరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రాష్ట్ర కమిటీకి నిర్వహించాల్సిన ఎన్నికలను జూలై 31లోగా పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఎంపీడీవోల పదోన్నతులలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్స్‌కు అన్యాయం జరిగిందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.సంఘం రాష్ట్ర ట్రెజరర్‌ పి.దస్తగిరిబాబు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కె.మోహన్‌రావు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు రా ఘవులు, సంఘం వివిధ జిల్లాల అధ్యక్షులు ముర ళి, సత్తిబాబు, శ్రీధర్‌రాజు, ప్రసాద్‌, నిర్మలభారతి, పెంచలయ్య, మురళీధర్‌రెడ్డి, శశిధర్‌, గుంటూరు జిల్లా కార్యదర్శి సమ్యుల్‌పాల్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement