నేను కేఎల్ యూనివర్సిటీలో 2007లో బీటెక్ చదువుతున్న సమయంలో ఎవరైనా రోగులు, రోడ్డు ప్రమాద బాధితులు ఆపరేషన్ కోసం రక్తం కావాలని అడిగితే స్వచ్ఛందంగా ఇవ్వడం ప్రారంభించాను. గుంటూరు జీజీహెచ్‌లో స్టేట్‌బ్యాంక్ ఇఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో పనిచేస్తున్న సమయంలో ఆస్పత్రిలో రక్తం కొరత ఉందని, రక్తం సకాలంలో లభించక పలువురు చనిపోతున్న విషయం తెలుసుకున్నా. ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది రక్తం ప్రాధాన్యత గురించి వివరించారు. దాంతో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తున్నాను. ఒడిశాలో రెండు రైళ్లు ఢీకొని పలువురు మరణించటం, అనేక మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని వార్తలలో చూసి ఆ రాష్ట్రం వెళ్లా. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రక్తదానం చేశా. ఇప్పటి వరకు 44 సార్లు రక్తదానం చేశాను. రక్తదానం చేయడం వల్ల ఎంతో పుణ్యం రావడం, మంచి ఆరోగ్యం సొంతం అవుతుందని నా నమ్మకం.
– జంగం అనుదీప్ సత్యప్రకాష్, ఎస్‌బీఐ సీనియర్ అసోసియేట్, గుంటూరు


