ఒకరు చేసే రక్తదానంతో నలుగురి ప్రాణాలు కాపాడవచ్చు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలిచిపోవాలి. జిల్లా జనాభాలో ఒక శాతం రక్తం సేకరణ చేయాల్సి ఉంది. జిల్లాలో 17 బ్లడ్ బ్యాంకుల్లో రోగులకు అవసరమైన రక్తాన్ని అందిస్తున్నారు. రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తులు, సంస్థలను ఘనంగా సన్మానిస్తున్నాం.
– డాక్టర్ కొర్రా విజయలక్ష్మి,
డీఎంహెచ్‌ఓ, గుంటూరు
●


