ఏఎన్‌యూ (పెదకాకాని): పరీక్ష ఫలితాలను ఏఎన్‌యూ దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఏ హిస్టరీ, సంస్కృతం, ఎంహెచ్‌ఆర్‌ఎం 1,2,3,4 సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, డిప్లమా ఇన్ సైకాలజీ పరీక్ష ఫలితాలను విడుదల చేశామన్నారు. ఈ నెల 24వ తేదీలోగా రీవాల్యుషన్ దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ప్రతి పేపర్‌కు రూ.1400 చొప్పున చెల్లించాలని చెప్పారు. దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా పరీక్షల కోఆర్డినేటర్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్‌సైట్ నుంచి పొందవచ్చన్నారు.
బాల్యం ఓ వరం
Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM
బాల్యం ఓ వరం
గుంటూరు లీగల్: బాల్యం అనేది ఒక అద్భుత వరమని.. ఆటపాటలతో, చదువుకుంటూ ఉండాల్సిన పిల్లలు కూలీ పనులు చేస్తూ, బిక్షాటన చేస్తూ ఉండటం బాధాకరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అన్నారు. శుక్రవారం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో నిర్వహించారు. సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ బ్యాక్ టు స్కూల్ అనే నినాదంతో పనులకు వెళ్లే పిల్లలందరినీ స్కూలుకు పంపించడమే ముఖ్యోద్దేశమని తెలిపారు. భవిష్యత్తు తరాలకి మనం ఇచ్చే ఆస్తి విద్య మాత్రమేనని ఆర్థిక, కుటుంబ కారణాల వలన పిల్లలు విద్యను కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చట్టంలో చాల కఠినమైన శిక్షలున్నాయని, పిల్లలకు ఫ్రెండ్లీ వాతావరణంలో కౌన్సెలింగ్ ఇస్తామని, పిల్లలకు ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా పొందవచ్చని తెలిపారు. లోక్ అదాలత్ చైర్మన్ పి. ఆర్.రాజీవ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యకు పరిష్కారం చూపాలని అన్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేయాలని కోరారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్ శ్రీనివాసరావు, ఫ్రాన్సిస్ తంబి, డీసీపీఓ విజయ్‌కుమార్, డిస్ట్రిక్ట్ మిషన్ కో– ఆర్డినేటర్ శ్రీవాణి, క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు, పారా లీగల్ వలంటీర్స్, ప్యానెల్ అడ్వొకేట్స్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి స్టేషన్‌లో
రైల్వే జీఎం పరిశీలన
తెనాలిరూరల్: తెనాలి రైల్వేస్టేషన్‌ను దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథుర్ శుక్రవారం పరిశీలించారు. ప్రత్యేక రైలులో వచ్చిన ఆయన స్టేషన్‌లో ప్లాట్‌ఫాంలు, సర్క్యులేటింగ్ ఏరియా, అమృత్ భారత్ కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. తెనాలి స్టేషన్ నుంచి రోజుకు 16,800 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని, 30 వేల మందికి సరిపడా సదుపాయాలను కలుగజేయాలని సూచించారు. సర్క్యులేటింగ్ ఏరియా ఇరుకుగా ఉండడంతో మరో 500 మీటర్లు పొడిగించాలని చెప్పారు. స్టేషన్‌లో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్ల గురించి తెలుసుకున్నారు. తెనాలి మీదుగా వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తెనాలిలో హాల్ట్ ఇవ్వాలని పాసింజర్ అసోసియేషన్ తరఫున పలువురు వినతిపత్రాలు అందజేశారు. గుంటూరు–తిరుపతి, తిరుపతి–గుంటూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు తెనాలిలో హాల్ట్ ఇవ్వాలని, వైకుఠపురం వద్ద రైల్వే వంతెన వద్ద ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయవాది పెరికల డేనియల్ వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ వినీత్‌కుమార్, విజయవాడ డీఆర్‌ఎం మోహిత్ సొనాకియా, తెనాలి స్టేషన్ మేనేజర్ టీవీ రమణ, డిప్యూటీ స్టేషన్ మేనేజర్ బి.వీరయ్య, ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ హీరాసింగ్, జీఆర్పీ ఎస్‌ఐ ఎల్.సరస్వతి, ఇతర అధికారులు ఉన్నారు. ఏఎన్‌యూ దూరవిద్య
పరీక్ష ఫలితాలు విడుదల
Advertisement


