● కాసు కన్వెన్షన్ హాలులో
ఆశా, ఏఎన్‌ఎంలతో యోగాంధ్ర
● పాల్గొన్న జిల్లా కలెక్టర్,
జాయింట్ కలెక్టర్, అధికారులు
నరసరావుపేట: యోగాను జీవితంలో ప్రతి ఒక్కరూ భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆశా, ఏఎన్‌ఎమ్‌లతో యోగాంధ్ర కార్యక్రమం పెద్దచెరువులోని కాసు కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం యోగా శిక్షకులు ఆధ్వర్యంలో దాదాపు ఒక గంట పాటు నిర్వహించిన యోగా కార్యక్రమంలో అందరూ యోగాసనాలు వేశారు. అనంతరం యోగా మంత్రంతో కార్యక్రమాన్ని ముగించారు. కలెక్టర్ మాట్లాడుతూ యోగాను జీవితాంతం ఆచరించే ఆరోగ్యకరమైన జీవన విధానంగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడుతుందన్నారు. యోగా, నడక, సరైన ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు ప్రతి రోజు యోగ చేయాలి అన్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడులు ఉన్నప్పటికీ ఆరోగ్యం కోసం యోగాను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల ఏడవ తేదీ నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోని ప్రతి గ్రామం, మండలంలో యోగా ట్రైనర్, మాస్టర్లచే యోగ నిర్వహించడం జరుగుతున్నదన్నారు. జాయింట్ కలెక్టర్ సంజన సింహ మాట్లాడుతూ యోగాని విద్యార్థి దశ నుంచే ప్రారంభించాలని అన్నారు. యోగ వలన ఏకాగ్రత పెరుగుతుందన్నారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.


