అమరావతి మండల కేంద్రంలో పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. సత్తెనపల్లి రహదారిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి అమరలింగేశ్వర దేవాలయం సమీపంలోని వంగవీటి రంగా విగ్రహం వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. ర్యాలీకి వచ్చేవారిని అడుగడుగునా ఆంక్షలతో పోలీసులు అడ్డగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ సూపర్‌సిక్స్ అమలులో చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు యెనుముల మురళీధర్‌రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈదా సాంబిరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు వెంపా జ్వాలా నరసింహారావు, ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు, పలు విభాగాల నాయకులు పాల్గొన్నారు.


