చిలకలూరిపేటలో నరసరావుపేట రోడ్డులోని మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద నుంచి భాస్కర్‌సెంటర్‌లోని డాక్టర్ వైఎస్సార్ విగ్రహం వరకు పాదయాత్రగా ర్యాలీ నిర్వహించారు. పోలీసులు బైకు ర్యాలీని అడ్డుకోవటంతో పాదయాత్రగానే నిర్వహించారు. మైకులు కూడా అడ్డుకున్నారు. సెంటర్‌లో కార్యక్రమాన్ని ఉద్దేశించి రజని మాట్లాడుతూ సూపర్ సిక్స్‌కాదు సూపర్ స్కెచ్‌తో ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలవికాని హామీలతో అన్నీ వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. పరిశీలకులు చిట్టా విజయభాస్కరరెడ్డి, షేక్ దరియావలి, దేవినేని శంకరరావు, మంగు ఏడుకొండలు, రాచమంటి చింతారావు, కందుల శ్రీకాంత్, సయ్యద్ జమీర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


