పీసపాడు వద్ద కారు, ఇసుక ట్రాక్టర్‌ ఢీ | - | Sakshi
Sakshi News home page

పీసపాడు వద్ద కారు, ఇసుక ట్రాక్టర్‌ ఢీ

Jun 13 2026 7:26 AM | Updated on Jun 13 2026 7:26 AM

క్రోసూరు: మండలంలోని పీసపాడు గ్రా మ ప్రధాన రహదారిపై భారత్‌ పెట్రోల్‌ బంక్‌ దగ్గరలో శుక్రవారం ఇసుక ట్రాక్టర్‌, కారు ఢీకొన్నాయి. పెదకాకానికి చెందిన మాజీ ఎంపీపీ నల్లిమల్లి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్‌ బద్దిపూడి రమేష్‌, మరో ఇద్దరు వ్యక్తిగత పనులపై కారులో సత్తెనపల్లి మీదగా మండలంలోని పీసపాడు వస్తున్నారు.ట్రాక్టర్‌ క్రోసూరు వైపు నుంచి సత్తెనపల్లి వెళ్తుంది. ఇసుక ట్రాక్టర్‌, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురుకి గాయాలయ్యాయి. ఒకరు గుంటూరు ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా మరో ముగ్గురు దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. ఇసుక ట్రాక్టర్‌ డ్రైవర్‌కు స్వల్పగాయాలైనట్లు సమాచారం. ట్రాక్టర్‌ ముప్పాళ్ల మండలం కు చెందినదిగా తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement