ఎల్‌ నినో దెబ్బపడకుండా.. | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ నినో దెబ్బపడకుండా..

Jun 15 2026 4:28 AM | Updated on Jun 15 2026 4:28 AM

ఆర్మూర్‌: వ్యవసాయంపై ఎల్‌నినో ప్రభావం పడే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ హెచ్చరిస్తోంది. అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా దెబ్బ తినేది దుంప పంటలే.ప్రతికూల పరిస్థితుల్లో పసుపు లాంటి దుంప పంటల దిగుబడి దెబ్బతినకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉద్యాన, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

బెడ్‌సిస్టం బెటర్‌..

పసుపు నాటే ముందు చదును భూమిలోనే విత్తనం వేస్తే భారీ వర్షం పడగానే నీరు నిలిచి దుంపలు కుళ్లిపోతాయి.అందుకే నాటే ముందు 4–5 అడుగుల వె డల్పు బెడ్లు తయారు చేసుకొని, రెండు బెడ్ల మధ్య కాలువలు తీసుకొని బెడ్డుపై పసుపును విత్తుకోవాలి. ఇలా చేస్తే ఆకస్మికంగా కురిసే భారీ వర్షాల్లోనూ నీరు బయటకు పోయి వేరుకు గాలి అందుతుంది.

విత్తన శుద్ధి తప్పనిసరి..

పసుపు పంటకు దుంప తెగులు ఎక్కువగా విత్తనం ద్వారానే వస్తుంది. నాటే ముందు రోజు మాంకోజెబ్‌, రిడోమిల్‌ లేదా కార్బెండజిమ్‌తో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. ఇలా చేస్తే నాటిన తర్వాత వచ్చే వేరుకుళ్లు, రైజోమ్‌ రాట్‌ వంటి తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోవచ్చు.

బిందు సేద్యంతో నీరు, ఎరువు ఆదా...

ఎల్‌ నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం కావొచ్చు, లేదా ఒక్కసారిగా కురవొచ్చు. బిందు సేద్యం ద్వా రా నీరు, ఎరువులు నేరుగా వేరు దగ్గర ఇ వ్వడం ఉత్తమం.ఇలా చేస్తే నీటి వృథా తగ్గడంతోపాటు ఎరువుల ఖర్చు కూడా 30%–40%తగ్గుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement