సిరికొండ: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టు ఫెన్సింగ్ లేకపోవడంతో వాటితో ప్రమాదం పొంచి ఉంది. అలాగే తక్కువ ఎత్తులో ఉండటంతో కాలనీలోని చిన్నారులు ఆడుకుంటు ఆకస్మాత్తుగా అటు వైపు వెళితే విద్యుత్ షాక్‌కు గురయ్యే అవకాశం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వానాకాలం కావడంతో తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లతో ప్రమాదాలు సులువుగా జరిగే అవకాశం ఉందని కాలనీవాసులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ల గద్దెల చుట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేయించాలని కోరుతున్నారు.


