రక్తదానంతో ఎంతోమందికి పునర్జన్మ | - | Sakshi
Sakshi News home page

రక్తదానంతో ఎంతోమందికి పునర్జన్మ

Jun 15 2026 4:28 AM | Updated on Jun 15 2026 4:28 AM

సుభాష్‌నగర్‌:రక్తదానం చేయడంతో ఎంతోమందికి పునర్జన్మను ప్రసాదించవచ్చని రోటరీ క్లబ్‌ జేమ్స్‌ అ ధ్యక్షుడు పాకాల నర్సింహారావు తెలిపారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం పురస్కరించుకొని నగరంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రోటరీ క్లబ్‌ జేమ్స్‌ ఆ ధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.21 మంది స్వచ్ఛందంగా రక్తదా నం చేశా రు.అనంతరం అధ్యక్షుడు నర్సింహారావు మాట్లాడుతూ ఆరోగ్యవంతులైన యువకులు నిర్ధిష్ట సమయంలో రక్తదానం చేయడంతో వారి ఆరోగ్యానికి ఎ లాంటి ప్రమాదం ఉండదన్నారు.రక్తం దొరకక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్య క్తంచేశారు.యువకులు ప్రతి మూడునెలలకొకసారి రక్తం దానం చేయవచ్చని తెలిపారు.కార్యక్రమంలో క్లబ్‌ సెక్రెటరీ గంజి రమేశ్‌, ప్రాజెక్ట్‌ చైర్మన్‌ కోటగిరి చంద్రశేఖర్‌, క్లబ్‌ సభ్యులు గిరీశ్‌ కుమార్‌,సంపత్‌ కు మార్‌,శేఖర్‌,ముక్కా శ్రీనివాస్‌,బంగారివీరబ్రహ్మం, నాగేశ్వరరావు, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement