సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ పార్ల మెంటు పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో ప్రజాసమస్యలపై కార్యక్రమాలు మరింత ముమ్మరం చేయాలనే లక్ష్యంతో బీజేపీ సమీక్షలు చేస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయమై, ఇతర ప్రజాసమస్యలపై కార్యక్రమాలు చే యాలని ఇటీవల ప్రధాని మోదీ సూచించిన నేపథ్యంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పార్టీ నాయకుల కు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎంపీ స మీక్షలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ చూ పిన పెర్ఫార్మెన్స్ మీద సమీక్ష చేయడంతో పా టు రానున్న పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూ హాలపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మండల, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలకు పార్టీ శ్రేణుల ను సన్నద్ధం చేయడంతో పాటు భవిష్యత్తులో వచ్చే సాధారణ ఎన్నికలకు సిద్ధం అయ్యేలా ముందుకు వెళ్లాలని ప్రణాళికలు తయారు చేస్తున్నారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో నెలకొన్న గ్రూపు తగాదాల నేపథ్యంలో కేడర్ అయోమయంలో ఉంది. ఇందుకు సంబంధించి కార్యకర్తలు బహిరంగంగానే చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్మూర్ మున్సిప ల్ ఎన్నికల్లో ఎంపీ అర్వింద్ పూర్తిగా ఎమ్మెల్యే రాకే ష్‌రెడ్డికే బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ పార్టీకి ఉన్న బలానికి తగినట్లు కాకుండా పూర్తిస్థాయిలో పేలవ ప్రదర్శన చేసినట్లు ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆశించిన మేరకు సీట్లు రాకపోవడంతో ఎంపీ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ఇక ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పార్టీ కార్యక్రమాలు అంతంతమాత్రంగానే చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. బోధన్, బాల్కొండ నియోజకవర్గాల్లో సైతం కార్యక్రమాలు చేయడంలేదని ఎంపీ అన్నట్లు తెలిసింది. గతంలో కోర్ కమిటీ సమావేశంలో చెప్పినవిధంగా ఆర్మూర్, బోధన్, బాల్కొండ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు చేయడంలేదని ఎంపీ స్పష్టం చేసినట్లు సమాచారం.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో గట్టిగా పెర్ఫార్మ్ చేయడం, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పార్టీ కా ర్యక్రమాలపై ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ కార్యక్రమాలు గట్టిగానే చేస్తున్నారని ఎంపీ సానుకూలంగా ఉన్న ట్లు తెలిసింది. జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోనూ మున్సిపల్ ఎన్నికల్లో పెర్ఫార్మ్ చేయడంపై సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కోరుట్లలో డాక్టర్ అనూప్‌రావు కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ మరిన్ని కార్యక్రమాలు చేయాలని సూచించినట్లు తెలిసింది. జగిత్యాలలో పార్టీ కార్యకలాపాల విషయంలో, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం కోసం స్థలం కోసం చేసిన పోరాటం విషయంలో బోగ శ్రావణి గట్టిగా పనిచేసినట్లు, ఇదేవిధంగా అన్ని సెగ్మెంట్లలో ముందుకు వెళ్లాలని సమీక్షలో చెప్పినట్లు సమాచారం. రానున్న శాసనసభ ఎన్నిక ల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని కార్యక్రమాలను నిశితంగా పరిశీలిస్తామని ఎంపీ సమీక్షలో ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది.
పార్లమెంటు పరిధిలో సెగ్మెంట్ల వారీగా సమీక్షిస్తున్న ఎంపీ
మున్సిపోల్స్ ఫలితాలపై రివ్యూ..
పరిషత్ ఎన్నికలపై కసరత్తు
ఆర్మూర్ మున్సిపాలిటీలో పేలవ
ప్రదర్శనపై అసహనం
ఆర్మూర్ సెగ్మెంట్‌లో గ్రూపులపై
కార్యకర్తల్లో అయోమయం
ప్రజాసమస్యలపై కార్యక్రమాలు ముమ్మరం చేయాలని అర్వింద్
దిశానిర్దేశం


