ఖలీల్‌వాడి: జిల్లా విద్యాశాఖ ఏడీగా సూపరింటెండెంట్ వాణికి ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్ వరంగల్‌లోని ఆర్‌జెడీకి ఫైల్ పంపినట్లు తెలిసింది. ఇటీవల బదిలీలో ఏడీ నాగజ్యోతి హైదరాబాద్‌కు బదిలీ కాగా ఆమె స్థానంలో ఏడీగా కరీంనగర్ నుంచి మాధవిని నియమించారు. ఆమెకు ఆదిలాబాద్ డీఈవోగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.
సుభాష్ నగర్: జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోగా శంకర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సా ధారణ బదిలీల్లో భాగంగా నిర్మల్ నుంచి నిజామాబాద్‌కు ఆయన బదిలీ అయ్యారు. డిప్యూ టీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన శంకర్ ను సీఈవో సాయగౌడ్, జిల్లా పరిషత్ సూపరింటెండెంట్లు, యూనియన్ నాయకులు, ఎంపీడీవోలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం లో జిల్లా పరిషత్ ఉద్యోగులు పాల్గొన్నారు.
● కార్మికునికి తీవ్రగాయాలు
భిక్కనూరు: మండల కేంద్రం సమీపంలోని ఎంఎస్‌ఎన్ ఫార్మా కంపెనీలో శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్‌లో కెమికల్ నింపుతుండగా ఆకస్తాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. దీన్ని గమనించిన సిబ్బంది వెంటనే గాయపడ్డ కార్మికులను కామారెడ్డిలో పలు ఆస్పత్రులకు తరలించారు. అందులో ఒక్కరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. సదరు కార్మికునికి హైదరాబాద్‌లో శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన విషయాన్ని ఎవ్వరికి చెప్పవద్దని డ్యూటీలో ఉన్న కార్మికులను సిబ్బంది హెచ్చరించినట్లు తెలిసింది.
చెట్టును ఢీకొన్న బైక్.. ఇద్దరికి ..
రుద్రూర్: పోతంగల్ మండలం జల్లాపల్లి అభాది శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయలైనట్లు స్థానికులు తెలిపారు. కల్లూర్ గ్రామానికి చెందిన రాంరెడ్డి, అశోక్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై పోతంగల్ నుంచి కల్లూర్‌కు బయలుదేరారు. జల్లాపల్లి అభాది శివారులో వారి బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు కిందపడగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మోస్రా మండల కేంద్రంలో..
వర్ని: మోస్రా మండల కేంద్రంలో జరిగిన రో డ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాల య్యా యి. రుద్రూర్ మండలం చిక్కడపల్లి గ్రా మానికి చెందిన శ్రీను, సురేష్ బైక్‌పై నిజామాబాద్ నుంచి వర్ని వైపు బయలుదేరారు. మోస్రాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న శంకర్‌ను వీరు ఢీకొట్టారు.ఈఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు వారిని చికిత్స నిమి త్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.


