నేడు మంత్రి ఉత్తమ్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి ఉత్తమ్‌ పర్యటన

Jun 10 2026 12:55 AM | Updated on Jun 10 2026 12:55 AM

నేడు మంత్రి ఉత్తమ్‌ పర్యటన ఈనెల 11న ‘బెస్ట్‌ అవైలబుల్‌’ లక్కీ డ్రా దరఖాస్తుల ఆహ్వానం జాతీయ స్థాయి బేస్‌బాల్‌ పోటీలకు ఎంపిక ఆర్యవైశ్య మహాసభ రీజినల్‌ చైర్మన్‌గా గౌరీ శంకర్‌

నిజామాబాద్‌ అర్బన్‌: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. ముందుగా వర్ని మండలంలోని సిద్దాపూర్‌ రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. అనంతరం జాకోరా గ్రామంలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను ప్రారంభించి పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.15 నిమిషాలకు హెలికాప్టర్‌ ద్వారా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీకి బయల్దేరి వెళ్తారు.

ఖలీల్‌వాడి: 2026–27 విద్యా సంవత్సరానికి బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకం కింద ఒకటో తరగతి (నాన్‌–రెసిడెన్షియల్‌)లో 102 సీట్లు, 5వ తరగతి (రెసిడెన్షియల్‌)లో 101 సీట్లు మంజూరైనట్లు సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ రజిత మంగళవారం తెలిపారు. ప్రవేశాల కోసం అర్హులైన షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థినీవిద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 11న ఉదయం 10.30 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని రూమ్‌ నం.3లో లక్కీ డ్రా తీస్తామని తెలిపారు.

మోపాల్‌: మండలకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో యంగ్‌ ఇండియా ఇన్‌స్టిట్యూషన్‌ ఎక్స్‌లెన్స్‌ కోర్సులోభాగంగా సీఈసీ – సీఎల్‌ఏటీ(లా)లో శిక్షణ ఇచ్చేందుకు అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌ సుప్రజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 93 కేజీబీవీల్లో ఈ విద్యాసంవత్సరం నుంచే కోర్సు ప్రారంభమవుతుందని, ప్రతిరోజూ రెండు గంటలపాటు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నారు. కరెంట్‌ ఎఫైర్స్‌, లీగల్‌ రీజనింగ్‌, లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటీవ్‌ టెక్నిక్స్‌కు సంబంధించిన నిపుణులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగల వారు 76748 24361 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

సిరికొండ: జాతీయ స్థాయి బేస్‌బాల్‌ పోటీలకు సిరికొండ సత్యశోధక్‌ పాఠశాల జట్టు ఎంపికై ందని ప్రిన్సిపాల్‌ ఆర్‌ నర్సయ్య తెలిపారు. ఏప్రిల్‌లో ఆర్మూర్‌లో నిర్వహించిన నిజామాబాద్‌ రీజినల్‌ ఉభయ రాష్ట్రాల మేజర్‌ లీగ్‌ బేస్‌బాల్‌ కప్‌ ఇండియా అండర్‌–11 చాంపియన్‌షిప్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చి గ్రూప్‌ బి విజేతగా నిలిచి చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకొని జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు బెంగళూరులో నిర్వహించే జాతీయ స్థాయి మేజర్‌ లీగ్‌ బేస్‌బాల్‌ కప్‌ ఇండియా–2026 పోటీల్లో జట్టు పాల్గొంటుందని తెలిపారు. హర్షిత్‌, సతీష్‌, శివచరణ్‌, శ్రీరామ్‌, రిత్విక్‌, సాయిసృజన్‌, అభిరామ్‌, విశ్వక్‌సేనా, విద్వాన్‌, రిషివరుణ్‌తేజ్‌, రిశ్విత్‌, రిత్విక్‌లు సభ్యులుగా, పీఈటీలు దండు అనిల్‌, బాదావత్‌ సంతోష్‌లు కోచ్‌, మేనేజర్లుగా వ్యవహరిస్తారన్నారు. జాతీయ స్థాయికి ఎంపికై న క్రీడాకారులను పాఠశాలలో మంగళవారం అభినందించారు.

కామారెడ్డి టౌన్‌ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రీజినల్‌ చైర్మన్‌గా శెనిశెట్టి గౌరీ శంకర్‌ నియామకమయ్యారు. మంగళవారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మినారాయణ నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గౌరీ శంకర్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవి అప్పగించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు కై లాస్‌ శ్రీనివాస్‌రావు తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement