పెర్కిట్(ఆర్మూర్): ప్రభుత్వం నూతనంగా తీసుకు వచ్చిన యూరియా యాప్ ద్వారా తీవ్రంగా నష్టపోతున్నామని ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో రైతు లు మంగళవారం 63వ నెంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వారు మాట్లాడు తూ యూరియా యాప్ విధానం వల్ల సకాలంలో యూరియా అందడం లేదని, తక్షణమే యాప్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సాగవుతున్న మొక్కజొన్న, ఖరీఫ్ పనులు చేపట్టిన రైతుల కు యాప్ విధానం వల్ల యూరియా లభించక సొసై టీ వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంద న్నారు. స్మార్ట్‌ఫోన్లు లేని వారు, వాడే విధానం తెలి యని వారు యాప్‌లో యూరియా బుక్ చేసుకోలేక పోతున్నారన్నారు. రైతులు వ్యవసాయ పనులు చే సుకోకుండా యూరియా కోసం సొసైటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం యాప్‌ను తొలగించి సొసైటీ యూనిట్ గా రైతుల కు యూరియాను అందజేయాలని డిమాండ్ చేశా రు. రైతుల రాస్తారోకోతో రహదారికి ఇరువైపుల వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు సర్ది చెప్పి రాస్తారోకోను విరమింప చేశారు. రాస్తారోకోలో స్థానిక సర్పంచ్ అంక్సాపూర్ దేవేందర్ రెడ్డి, వినోద్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నవీన్ రెడ్డి పాల్గొన్నారు.


