నగరంలో భారీ చోరీ | - | Sakshi
Sakshi News home page

నగరంలో భారీ చోరీ

Jun 10 2026 12:49 AM | Updated on Jun 10 2026 12:49 AM

30 తులాల బంగారం ఎత్తుకెళ్లారు

రిటైర్డ్‌ జాయింట్‌ కలెక్టర్‌

నివాసంలో దొంగతనం

నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌ నగరంలోని సుభాష్‌నగర్‌లో సోమవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. రామాలయం పక్కన రిటైర్డ్‌ జా యింట్‌ కలెక్టర్‌ రవికుమార్‌ నివాసంలో ముగ్గురు దొంగలు చొరబడ్డారు. ఇంటిలోని 30 తులాల బంగారం, అరతులం వెండి, ఇంటిలో ఉన్న లాకర్‌ను ఎత్తుకెళ్లారు. ఇందులో బంగారు ఆభరణాలు ఉన్నా యి. రవికుమార్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. మంగళవారం ఇంటికి వాచ్‌మెన్‌ వెంకట్‌ రాగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. దీంతో రవికుమార్‌కు సమాచారం అందించారు. అనంతరం మూడో టౌన్‌ పోలీసులకు తెలుపగా ఏసీపీ ప్రకాశ్‌యాదవ్‌, ఎస్సై హరిబాబులు వచ్చి దొంగతనం తీరును పరిశీలించారు. ముగ్గురు దొంగలు చోరీకి పాల్పడినట్లు సమీపంలోని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఇంట్లోని సీసీపుటేజీ డీపీఆర్‌ను దొండలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement