డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని చిన్నయానం వద్ద ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ పచ్చిక బయళ్లలో అరుదైన పక్షి గుడ్లు స్థానికులకు కనిపించాయి. ఐతే, ఈ గుడ్లు టిట్టిభం (లాప్వింగ్) అనే పక్షికి చెందినవి. సాధారణంగా పక్షులు చెట్లపైన గూళ్లు కట్టుకుంటాయి. కానీ, టిట్టిభం పక్షులు మాత్రం నేలపైనే చిన్న గుంతలా చేసి గుడ్లు పెడతాయి. వీటి గుడ్లు మట్టి రంగులో, నల్లటి మచ్చలతో ఉండటం వల్ల శత్రువుల కంటికి సులువుగా కనిపించవు. ఇప్పుడు బ్యాక్ వాటర్‌లో పచ్చగడ్డిని సంతానోత్పత్తికి ఆవాసాలుగా చేసుకున్నాయి.


