సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే గుర్రు గా ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారితో పాటు కీలక నాయకులు తమను పట్టించుకోవడం లేదని, చివరకు అధికార యంత్రాంగం సైతం చిన్నచూపు చూస్తోందని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామాల పాలనలో కీలకంగా వ్యవహరిస్తూ నే అప్పులు చేసి మరీ పనులు చేస్తున్న సర్పంచ్‌లు, పంచాయతీల పాలకవర్గాలు సైతం ప్రభుత్వం తమను చిన్నచూపు చూస్తోందంటూ ఆవేదన చెందుతున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ బహి రంగంగానే తమ అసహనాన్ని వెలిబుచ్చుతున్నా రు. బిల్లులు రాక అప్పుల పాలవుతున్నామని స ర్పంచ్‌లు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే చిన్నతరహా, మధ్యతరహా, పెద్దతరహా అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లూ తమ కు బిల్లులు ఇవ్వకపోతుండడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కాంట్రాక్టర్లు చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు. 1941లో ఏర్పాటై జాతీయ స్థాయి సంస్థగా ఉన్న ‘బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండి యా’ ఆధ్వర్యంలో ‘మా హక్కు–మా బిల్లులు–రాష్ట్ర అభివృద్ధి’ అనే నినాదంతో చలో హైదరాబాద్ కార్యక్రమానికి అన్ని ఉమ్మడి జిల్లాల్లో సన్నాహ క సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నిజామాబాద్‌లో కాంట్రాక్టర్లు రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన సమావేశంలో సన్నాహక సమావేశంపై మాట్లాడారు. ఇందులో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కార్యదర్శి భా స్కర్‌రెడ్డి, ప్రమోద్‌రెడ్డి, సురేందర్‌రావు, బాగారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సంజీవరెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చలో హైదరాబాద్ పోస్టర్ విడుదల చేశారు.
జిల్లాలో రూ.300 కోట్ల
బిల్లులు పెండింగ్
అప్పులకు వడ్డీలు చెల్లించలేక
పోతున్నాం.. ఆత్మహత్యలే
శరణ్యమవుతున్నాయ్..
18న ‘చలో హైదరాబాద్’కు
ఇందూరులో సన్నాహక సమావేశం


