● అందుబాటులో 27,203
మెట్రిక్ టన్నుల యూరియా
● కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఆందోళనకు గురి కా వాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇలా త్రిపా ఠి పేర్కొన్నారు. రాష్ట్రంలో జిల్లాలోనే అత్యధిక స్థాయిలో 27,203 మెట్రిక్ టన్నుల యూ రియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ప్రాంతాలలో పంట సాగు చేసే ప్రతి రైతుకు ఎరువులు అందేలా చూస్తామన్నారు. ఎలాంటి అక్ర మాలకు తావు లేకుండా, ఎరువులు పక్కదా రి పట్టకుండా పారదర్శకమైన పంపిణీ కో సం యూరియా బుకింగ్ యాప్ దోహదపడుతోందన్నారు. ఈ యాప్ పనితీరును గ మనించిన ఇతర రాష్ట్రాలు కూడా ఒక్క యూరియానే కాకుండా మిగతా అన్ని ఎరువులను కూడా బుకింగ్ యాప్ ద్వారానే రైతులకు అందిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. రైతులు ఒకేసారి ఎరువులను కొనుగోలు చే సి పెట్టుకోకుండా, అవసరాలకు అనుగుణంగా ద శల వారీగా తీసుకోవాలని, మోతాదు కు మించి వాడవద్దని హితవు పలికారు. ఎరువుల దుకాణాలు, వివిధ సంస్థల ద్వారా కొనుగోలు చేసే రైతులను యూరియా, ఎరువులతో ముడిపెడుతూ ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని బలవంతం చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.
జీజీహెచ్
సూపరింటెండెంట్ బదిలీ
● 12 మంది ప్రొఫెసర్లకూ స్థానచలనం
సుభాష్‌నగర్: నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిధిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) ఇన్‌చార్జి సూపరిండెంటెండ్, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ బీవీ నాగమోహన్‌రావు బదిలీ అయ్యారు. ఆయనతోపాటు కళాశాలలోని మరో 12 మంది ప్రొఫెసర్లను బదిలీ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. నాగమోహన్‌రావును సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కళాశాలకు బదిలీచేశారు. వివిధ విభాగాల్లోని ప్రొఫె సర్లు డాక్టర్ పి మధు, డాక్టర్ ఎన్ బాల్‌రాజ్, డాక్టర్ డి ప్రతిమారాజ్, డాక్టర్ జె తిరుపతిరావు, డాక్టర్ కే శివప్రసాద్, డాక్టర్ సయేదా అమ్‌తుల్ మౌఖిత్, డాక్టర్ వి వెంకటేశ్వర్‌రావు, డాక్టర్ కేజే కిషోర్ కుమార్, డాక్టర్ బి శ్రీనివాస్, డాక్టర్ పి శ్రీనివాస్, డాక్టర్ కె విజయకుమార్, డాక్టర్ ఎన్ రవికిరణ్ బదిలీ అ య్యారు. వీరంతా ఇప్పటికే రిలీవ్ అయ్యా రు. అదేసమయంలో నిజామాబాద్ ప్రభు త్వ మెడికల్ కళాశాలకు బదిలీ అయిన వారిలో ఐదుగురు ఇప్పటికే రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేసిన వారిలో డాక్టర్ ఏ విశాల్, డాక్టర్ పి వెంకటేశ్వర్లు, డాక్టర్ టి దినేష్‌కుమార్, డాక్టర్ తానాజీ జాడె, డాక్టర్ మహ్మద్ యూసుఫ్ ఖాన్ ఉన్నారు. కాగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ రాములుకు తాత్కాలికంగా బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. బదిలీల ప్రక్రియ పూర్తయి వెంటనే సీనియారిటీ జాబితా ప్రకారం పూర్తిస్థాయి సూపరింటెండెంట్‌ను డీఎంఈ నుంచి నియమించనున్నట్లు సమాచారం.


