28న పల్స్‌ పోలియో చుక్కల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

28న పల్స్‌ పోలియో చుక్కల పంపిణీ

Jun 9 2026 9:16 AM | Updated on Jun 9 2026 9:16 AM

అదనపు కలెక్టర్‌ భుజంగరావు

జిల్లా సమన్వయ కమిటీ సమావేశం..

సుభాష్‌నగర్‌: ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్‌ పోలియో చుక్కల మందును ఈనెల 28న పంపిణీ చేయనున్నట్లు అదనపు కలెక్టర్‌ భుజంగరావు తెలిపారు. 29, 30 తేదీల్లో వైద్యసిబ్బంది, వలంటీర్లు ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కల మందును వేస్తారన్నా రు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ అధ్యక్షతన డయేరియా, పోలియో, నులిపురుగుల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రధాన చౌరస్తాలో ట్రాన్సిట్‌ బూత్‌ల ను ఏర్పాటు చేసి పల్స్‌ పోలియో వందశాతం విజ యవంతమయ్యేలా చూడాలన్నారు. చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు.

డయేరియా మరణాలు నివారించాలి..

ఈనెల 16 నుంచి జూలై 31 వరకూ డయేరియా నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ ఆదేశించారు. ఐదేళ్లలోపు పిల్లలు డయేరియా లక్షణాలతో మరణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లలకు రెండు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, 14 జింక్‌ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. పట్టణ మురికి వాడలు, గిరిజన ప్రాంతా లు, మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే వా రిలో డయేరియా మరణాలు జరగకుండా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలనలోభాగంగా ఏడాది వయసు నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రను ఇవ్వనున్నట్లు అదనపు కలెక్టర్‌ తెలిపారు. డీఎంహెచ్‌వో రాజశ్రీ, డీఈవో అశోక్‌, ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌, రవికుమార్‌, ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement