పిల్లలను సర్కారు బడికే పంపాలి | - | Sakshi
Sakshi News home page

పిల్లలను సర్కారు బడికే పంపాలి

Jun 9 2026 9:10 AM | Updated on Jun 9 2026 9:10 AM

డొంకేశ్వర్‌ మండలం అన్నారం

పంచాయతీ తీర్మానం

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): మన ఊరి బడిని మన మే కాపాడుకుందాం.. ప్రయివేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేద్దామంటూ డొంకేశ్వర్‌ మండలం అన్నారం గ్రామ పంచాయతీతోపాటు గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మా నం చేశారు. గ్రామానికి అదనంగా ప్రీ ప్రైమ రీ పాఠశాల కూడా మంజూరైందని, మంచి విద్యతోపాటు రుచికరమైన మధ్యాహ్న భోజనం లభిస్తుందని సర్పంచ్‌ అట్టోలి సంజీవ్‌, వార్డు సభ్యులు ప్రజలకు గ్రామసభ ద్వారా అవగాహన కల్పించారు. ప్రత్యేక కమిటీ ఏ ర్పాటు చేసి విద్యా ప్రమాణాలు, వసతులను నిరంతరం పర్యవేక్షించాలని మరో తీర్మానం చేశారు. పంచాయతీతోపాటు గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారడంతోపాటు పలు గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది.

ప్రజావాణికి 146 ఫిర్యాదులు

నిజామాబాద్‌ అర్భన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 146 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు, అదనపు కలెక్టర్లు కిరణ్‌ కుమార్‌, భుజంగరావు, డీఆర్వో గీత, జిల్లా పరిషత్‌ సీఈవో సాయాగౌడ్‌, నిజా మాబాద్‌ ఏసీపీ ప్రకాశ్‌ లకు విన్నవిస్తూ అర్జీ లు సమర్పించారు. ఫిర్యాదులను పెండింగ్‌ లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement