తెలంగాణ–20 క్రికెట్‌ లీగ్‌కు జిల్లా కుర్రోడు | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ–20 క్రికెట్‌ లీగ్‌కు జిల్లా కుర్రోడు

Jun 9 2026 9:10 AM | Updated on Jun 9 2026 9:10 AM

నల్గొండ నైట్స్‌కు పాట్కూరి నితీశ్‌రెడ్డి

రూ.5.5 లక్షలకు కొనుగోలు

చేసిన ఫ్రాంచైజీ

రాష్ట్రవ్యాప్తంగా 8 జట్లతో లీగ్‌ నిర్వహణ

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: తెలంగాణ–20 పేరిట ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 8 జట్లు పోటీ పడనున్నాయి. జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్‌ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ పాట్కూరి తనూజరెడ్డి, శ్రీనివాసరెడ్డి దంపతుల కుమారుడు నితీశ్‌రెడ్డిని నల్గొండ నైట్స్‌ జట్టు రూ.5.5 లక్షలకు కొనుగోలు చేసింది. నల్లగొండ నైట్స్‌ జట్టు తరఫున నితీశ్‌రెడ్డి క్రికెట్‌ ఆడనున్నాడు. నితీశ్‌రెడ్డి గతంలో రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2018–19, 2019–20 సంవత్సరాల్లో అండర్‌–19 జట్లకు హైదరాబాద్‌ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2021–22లో కల్నల్‌ సీకే నాయుడు టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అండర్‌–25 జట్టుకు, 2021–22లో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే 2022–23లో హైదరాబాద్‌ అండర్‌–25 వన్డే జట్టుకు, 2023–24లో హైదరాబాద్‌ అండర్‌–23 వన్డే జట్టుకు కెప్టెన్‌ గా వ్యవహరించాడు.

2024–25లో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2024–25 విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించి పంజాబ్‌ జట్టుపై 100 పరుగులు సాధించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement