రుద్రూర్: పోతంగల్, కోటగిరి, రుద్రూర్ మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. బలమైన గాలుల కారణంగా పోతంగల్ మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన గొంటి సాయిలు ఇంటిపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. అలాగే ఓ ఇంటిపై చెట్టు పడటంతో వెంటనే స్థానికులు స్పందించి తొలగించారు. రుద్రూర్ మండలం లింగంపల్లి శివారులో విద్యుత్ స్తంభం, పోతంగల్ రహదారిపై చెట్టు నేలకొరిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
సిరికొండ: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు విరిగిపోయి విద్యుత్ తీగలపై పడడంతో స్తంభాలు ధ్వంసం అయ్యాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపోయి రోడ్లపై అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు నెలకొన్నాయి.


