● ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్):‘సర్’ప్రక్రియ లో ఏ ఒక్కరి ఓటు పోకుండా కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు క్రియాశీలకంగా వ్యవహరించాల ని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నా రు. ఆదివారం నిజామాబాద్ రూరల్ నియోజవర్గ పరిధిలోని 293 మంది పార్టీ బూత్ లె వెల్ ఏజెంట్లకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమ గ్ర సవరణ (సర్)పై డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని అమృతాగార్డెన్స్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సర్ ప్రక్రియలో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధ ర్, ప్రధాన కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, పొల సాని శ్రీనివాస్, ఎర్రన్న, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల్‌రాజు, మోపా ల్ సాయరెడ్డి, నవీన్ గౌడ్, చిన్నారెడ్డి, రూరల్ నియోజకవర్గ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు గొట్టిపాటి వాసు, బర్ధిపూర్ సర్పంచ్ కోట్ల భాస్కర్, శ్రీనివాస్, జలందర్, సొసైటీ చైర్మన్ రాంచందర్‌గౌడ్, చెలిమెల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలి
● పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు
ఎం చెన్నయ్య
ఖలీల్‌వాడి : పీఆర్సీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎం చెన్నయ్య డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పీఆర్‌టీయూ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజ రై మాట్లాడారు. పీఆర్సీతో పాటు ఫిట్మెంట్ ప్రకటించాలన్నారు. పెండింగ్ డీఏలలో వెంటనే మూడు డీఏలు ప్రకటించాలన్నారు. మోడల్ స్కూల్, కేజీబీవీ, రెసిడెన్షియల్ ఉపాధ్యాయులకు కూడా హెల్త్ కార్డ్స్ వర్తింప చేయాలన్నారు. సీపీఎస్ విధానం రద్దుపరిచి ఓపీఎస్ అమలు పరచాలన్నారు. సమావేశంలో పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి రత్నాకర్ రావు, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుచ్చన్న, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, ప్రధాన కార్యదర్శి జన పాల లక్ష్మీరాజం, నాగేశ్వర్ రావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


