పంచాయతీలు చెల్లించేదెలా?
మండలాల వారీగా బకాయిలు
బకాయిలను మాఫీ చేయాలి
రూ.177.37 కోట్లు
కమ్మర్‌పల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాయానికి గ్రాంట్లు రాక అల్లాడుతున్న గ్రామ పంచాయితీలకు విద్యుత్ బకాయిలు అదనపు ఆర్థిక భారంగా మారాయి. గ్రామ పంచాయతీల్లో వీధి దీపాలు, తాగునీటి సరఫరా (వాటర్ వర్క్స్) విద్యుత్ బిల్లులు ప్రతినెలా తడిసి మోపెడవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బకాయిలపై ప్రత్యేక గ్రాంటు విడుదల చేయాలని లేదా విద్యుత్ బకాయిలు మాఫీ చేయాలని సర్పంచులు కోరుతున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..!
జిల్లాలో 27 మండలాల పరిధిలోని 538 గ్రామ పంచాయతీల్లో 8422 కేటగిరి 6 ఏ, 6 బీ విద్యుత్ మీటర్ల ద్వారా రూ. 177.37 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయి. 2019 మార్చి నెలకు ముందు అప్పటి ప్రభుత్వం గ్రామ పంచాయతీల బకాయిలను పూర్తిగా మాఫీ చేసింది. 2019 ఏప్రిల్ నుంచి 2026 మార్చి 31 వరకు గ్రామ పంచాయతీల్లో విద్యుత్ దీపాలు, వాటర్ వర్క్స్‌కు సంబంధించి విద్యుత్ బకాయిలు పెరిగిపోయాయి.
నూతన సర్పంచ్‌ల ఎన్నిక తర్వాత గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులతో ఎంతో కొంత అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల గురించి ఎదురుచూపులు తప్పడం లేదు. చిన్న గ్రామ పంచాయతీల్లో సరైన ఆదాయం లేక అష్టకష్టాలు పడుతున్న సందర్భంలో విద్యుత్ బకాయిలు గుదిబండగా మారాయి. గత ప్రభుత్వం విద్యుత్ బకాయిలు మాఫీ చేసినట్లుగానే ఈ ప్రభుత్యం కూడా మాఫీ చేయాలని సర్పంచులు కోరుతున్నారు.
మండలం జీపీలు విద్యుత్ బకాయిలు
మీటర్లు రూ.కోట్లలో
ఆర్మూర్ 18 353 5.84
బాల్కొండ 10 185 3.66
భీమ్‌గల్ 27 388 5.13
బోధన్ 39 470 11.75
చందూర్ 07 115 2.65
ధర్పల్లి 22 294 5.57
డిచ్‌పల్లి 35 457 10.34
ఇందల్వాయి 23 318 5.95
జక్రాన్‌పల్లి 21 345 7.49
కమ్మర్‌పల్లి 14 306 6.21
కోటగిరి 29 403 11.81
మాక్లూర్ 31 446 6.16
మెండోరా 11 135 2.21
మోర్తాడ్ 11 289 7.72
మోస్రా 03 85 2.55
మోపాల్ 21 256 5.94
ముప్కాల్ 07 124 1.78
నందిపేట్ 34 691 19.14
నవీపేట్ 33 500 11.38
నిజామాబాద్ రూరల్ 20 208 4.52
రెంజల్ 17 289 6.83
రుద్రూర్ 10 221 3.83
సిరికొండ 31 412 6.06
వర్ని 23 316 6.38
వేల్పూర్ 17 325 6.04
ఎడపల్లి 16 324 8.20
ఏర్గట్ల 08 167 2.08
మొత్తం 538 8422 177.37
27 మండలాల్లో బిల్లులు
చెల్లించని జీపీలు
పేరుకుపోతున్న విద్యుత్ బిల్లులు
ప్రభుత్వమే చెల్లించాలని
సర్పంచుల వేడుకోలు
గత పాలకవర్గం హయాంలో కరెంట్ బిల్లులు చెల్లించాలంటే గ్రామ పంచాయతీకి భారంగా ఉంది. ప్రభుత్వం ప్రత్యేక నిధులైనా మంజూరు చేయాలి, లేదా ప్రభుత్వమైనా చెల్లించాలి. లేనిపక్షంలో పూర్తిగా మాఫీ చేసి ఆదాయం లేని గ్రామ పంచాయతీలను ఆదుకోవాలి.
– ఎం.డీ మెహబూబ్, సర్పంచ్,
చౌట్‌పల్లి, కమ్మర్‌పల్లి మండలం


